BANDI SANJAY | బీఆరెస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్‌రావు ఒక్కడే మంచి నాయకుడు … కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

బీఆరెస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్‌రావు ఒక్కడే మంచి నాయకుడని, ప్రజల మనిషి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. హరీశ్‌రావు బీజేపీ‌లోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు

BANDI SANJAY | బీఆరెస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్‌రావు ఒక్కడే మంచి నాయకుడు … కేంద్ర మంత్రి బండి సంజయ్  కీలక వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్‌రావు ఒక్కడే మంచి నాయకుడని, ప్రజల మనిషి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.
హరీశ్‌రావు బీజేపీ‌లోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. తాను హరీష్ రావుతో మాట్లాడలేదని, ఆయన వివాద రహితుడని ప్రశంసించారు .బీజేపీలో బీఆరెస్‌ఎల్పీ విలీనం ఒక డ్రామా అని విమర్శించారు. బీజేపీలోకి ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయాల్సిందేనని షరతు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు ఏ గుర్తుతో గెలిచి.. ఏ పార్టీలో చేరుతున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వన్ టైం సెటిల్ మెంట్ ఎవరికోసం తీసుకువచ్చారని నిలదీశారు. ఫీజు రీయంబర్స్‌పై సీఎం రేవంత్ ప్రకటనతో కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను వేధిస్తాయని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధిపై తాను చాల పట్టుదలతో ఉన్నానని, ఈ దఫా కరీంనగర్ మున్సిపాల్టీ సమావేశంలో అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని, కరీంనగర్ కార్పోరేషన్ ఫ్లాన్ అమోదింపచేసుకుని కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కలుస్తానన్నారు. కాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కరీంనగర్ మేయల్ సునీల్‌రావు కలవడం ఆసక్తికరంగా మారింది. మేయర్ బీజేపీలో చేరవచ్చన్న ప్రచారం చోటుచేసుకుంది.