ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తెలంగాణ ఉద్య‌మ ద్రోహి అని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్ల‌కు అమ్ముడు పోయిన వ్య‌క్తి అని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

విధాత‌ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తెలంగాణ ఉద్య‌మ ద్రోహి అని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్ల‌కు అమ్ముడు పోయిన వ్య‌క్తి అని సీఎం ధ్వ‌జ‌మెత్తారు. సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. నేను సోష‌ల్ మీడియాలో చూశాను. ఇక్క‌డ గెలిచిన ఎమ్మెల్యే ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. నేను ఎస్పీ ఆఫీసు ముంద‌ర‌నే కారు గుద్దేసిన‌. నేను బూతులు క్యాప్చ‌ర్ చేసిన‌. ఓట్లు గుద్దుకున్న నేనే. ఈ ఎమ్మెల్యేలే కావాల్నా మ‌న‌కు..? ఈ ఎమ్మెల్యే మొద‌ట్లో టీఆర్ఎస్‌లో ఉండే. ఉద్య‌మ ద్రోహి అయి అమ్ముడు పోయిండు. ఆ విష‌యం కూడా మీకు తెలుసు. ఏనాడైనా ఉన్నాడా తెలంగాణ కోసం.


తెలంగాణ‌కు శాప‌మే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కిర‌ణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌ను ఏం చేసుకుంటారో చేస్కోండి అని అన్నారు. తెలంగాణ‌కు చెందిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి అన్న రాజీనామా చేశారా..? అదే బీఆర్ఎస్ నాయ‌కులు ఎన్నిసార్లు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ప‌ద‌వులు, ఎమ్మెల్యే, ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి పేగులు తెగేదాకా తెలంగాణ కోసం కొట్లాడినం. కానీ వాళ్లు రాలేదు. ఉన్న తెలంగాణ‌ను ఆంధ్రాలో క‌లిపించింది తెలంగాణ కాంగ్రెస్సే. నీళ్లు ఇవ్వ‌క‌పోతే చ‌ప్పుడు చేయ‌నిది తెలంగాణ కాంగ్రెస్సే. ఉద్యోగాల్లో దోపిడీ జ‌రుగుతుంటే మాట్లాడ‌నిది తెలంగాణ కాంగ్రెస్సే.. మ‌ళ్ల ఇందిర‌మ్మ రాజ్యం తెస్త‌ర‌ట‌. మ‌ళ్ల‌ ముండ‌పోయ‌డానికా..? మ‌ళ్ల నీళ్లు లేని, క‌రెంట్ లేని తెలంగాణ‌నా..? ఎవ‌ర్నీ ఉద్ద‌రించ‌డానికి, ఇవాళ ఆప‌ద మొక్కులు మొక్కుతున్నారు అని కేసీఆర్ కాంగ్రెస్ నేత‌ల తీరుపై మండిప‌డ్డారు.