55నిమిషాల ఆలస్యంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్

కొత్త రేషన్ కార్డులు, గృహలక్ష్మి, ధరణి, కౌలు రైతులకు రైతు భరోసా తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం 10 గంటలకు సచివాలయంలోని వెస్టర్న్‌డోమ్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. దీంతో అధికారులు అంతా సచివాలయానికి చేరుకున్నారు. అయితే ఈ సమావేశానికి సీఎం రేవంత్ 55నిమిషాలు ఆలస్యంగా రావడంతో కార్యక్రమం దాదాపు గంట పాటు ఆలస్యం జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు,వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు.