కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, తెలంగాణ కోలుకోలేని విధంగా ఆర్థిక, సహజ వనరుల దోపిడి చేశారని, మేం రోజుకు 18గంటలు పనిచేస్తూ ఒక్కోక్కటిగా సరిచేసుకుంటు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు

కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారు ఆయన పాపాలకు భయపడ్డ వరుణుడు చలికాలంలో అధికారంలోకి వచ్చాం.. వర్షాకాలంలో ఉన్నది కేసీఆర్‌ ప్రభుత్వమే ఎన్నికల పొగతో ఫామ్‌హౌస్ నుంచి బయటకు 200 మంది పేర్లు 48 గంటల్లో ఇవ్వండి వారి కుటుంబాలను ఆదుకుంటాం కేసీఆర్ రద్దైన వెయ్యి నోటు లాంటోడు మాజీ సీఎంపై రేవంత్‌రెడ్డి ఫైర్‌ 6న తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర అక్కడే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల విధాత, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, తెలంగాణ కోలుకోలేని విధంగా ఆర్థిక, సహజ వనరుల దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాము రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు. తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్‌ బహిరంగ సభ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తెచ్చిందన్న కేసీఆర్ విమర్శలపై మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావికి వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తాయో తెలియదా? అని ఎద్దేవా చేశారు. గత వర్షాకాలంలో కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, కేసీఆర్ చేసిన పాపాలకు వరుణుడు భయపడి పారిపోయాడని వ్యాఖ్యానించారు. తాము చలికాలంలో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. ‘మీ పాపాల పాలనలో 20 రోజులు వానలు పడకపోవడం వల్లే 2024లో కరువు వచ్చింది. మీ పాలనలో చేసిన పాపాలను, మోసాలను మాపై రుద్దకండి’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. Also Read – ఎమ్మెల్సీ కవిత విచారణకు సీబీఐ పిటిషన్‌ రైతులు గుర్తొచ్చినందుకు సంతోషం పదేళ్ల తరువాతనైనా తెలంగాణ రైతులున్నారని కేసీఆర్‌కు గుర్తొచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టడం సంతోషకరమనిమని, పొగ పెట్టగానే కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు.. ఎన్నికలు అనే పొగ పెట్టడంతో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారి పాలనలో తాము రైతులు, విద్యార్థుల, ప్రజా సమస్యలపై ఆందోళనలకు పిలుపిస్తే తమను గృహనిర్బంధం చేశారని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్లాలనిచెప్పి.. ఆయన పర్యటనకు అధికారికంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ‘మీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల వద్దకు వెళ్లారు. మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే మీరు చేసిన పాపం కొంతైనా తగ్గేది’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.