కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాము
రాష్ట్రంలో ప్రజా ఆమోదంతో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి వీఆర్వో ఐక్య కార్యాచరణ కమిటీ స్వాగతం పలుకుతుందని చైర్మన్ గోల్కొండ సతీష్, సెక్రటరీ జనరల్ హరాలే

వీఆర్వో ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ గోల్కొండ సతీష్
విధాత: రాష్ట్రంలో ప్రజా ఆమోదంతో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి వీఆర్వో ఐక్య కార్యాచరణ కమిటీ స్వాగతం పలుకుతుందని చైర్మన్ గోల్కొండ సతీష్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్, అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్, కో చైర్మన్ రవి నాయక్, వైస్ చైర్మన్లు ప్రతిభ, రవీందర్, కృష్ణ గౌడ్, మౌలానా, నుకల్ శంకర్ లు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. బీద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణ, ప్రైవేటు భూముల హక్కులను కాపాడుతామన్నారు.
గ్రామాలలో సూపరి పాలన అందించేందుకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరలా పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు. దుర్బద్దితో బీఆరెస్ ప్రభుత్వం గ్రామ పాలనను రద్దుచేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ధరణి ఒక దరిద్రంగా మారిందని, ధరణి ద్వారా అనేకమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ధరణి వల్ల రెవెన్యూ ఉద్యోగులు హత్యలకు గురై మరణించడం జరిగిందన్నారు.