సర్వే రిపోర్టుతో కాంగ్రెస్ ప్రచారం

సర్వే రిపోర్టుతో కాంగ్రెస్ ప్రచారం

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడేస్తుంది. రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందంటూ పెట్టిన ఓపినియన్ పోల్‌లో లక్ష మంది పాల్గొనగా అందులో 60వేల మంది కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. 22వేల మంది బీఆరెస్‌, 14వేల మంది బీజేపీ గెలుస్తుందని చెప్పారు.