రైతులకు మేలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం.. కోదండరెడ్డి
రైతులకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేలు చేస్తుందని, ప్రతి హామీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు

విధాత, హైద్రాబాద్ : రైతులకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేలు చేస్తుందని, మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు, యువతకు, విద్యార్థులకు బీజేపీ, బీఆరెస్ పార్టీలు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయన్నారు. మరోసారి ఎన్నికల నేపథ్యంలో బూటకపు మోసపూరిత హామీలు, మ్యానిఫెస్టోలతో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థ ను ధరణితో బీఆరెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందన్నారు. ధరణిపై మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సీఎం కేసిఆర్ పట్టించుకోలేదన్నారు. కేంద్రం కూడా మూడు నల్ల చట్టాలు చేసి రైతులను నట్టేట ముంచిందన్నారు. రైతుల ఆగ్రహంతో తాత్కాలికంగా వెనక్కి తీసుకుందని, బీఆరెస్ ప్రభుత్వం మాత్రం ధరణితో ఉపసంహరించుకోకుండా భూ దందా సాగించిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ సహా ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు.