కాంగ్రెస్ నుంచి గద్దర్ కుటుంబానికి సీటు! కంటోన్మెంట్ నుంచి వెన్నెల పోటి?

విధాత, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గద్దర్ కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో సీటు ప్రకటించనున్నట్లు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అయితే టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో రాష్ట్ర నేతలు ఇటీవల రహస్యంగా చర్చలు జరిపారని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
గద్దర్ కూతురు వెన్నెలకు ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించి ఆ మేరకు ఏఐసీసీకి తెలిపినట్లు సమాచారం. అందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి సింకింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గద్దర్ కూతురు వెన్నెలను భరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ బావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి.