బీఆరెస్‌లో చేరిన కార్పోరేటర్ సింగిరెడ్డి దంపతులు

బీఆరెస్‌లో చేరిన కార్పోరేటర్ సింగిరెడ్డి దంపతులు

విధాత: జీహెచ్ఎంసీ, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష, ఆమె భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిలు శుక్రవారం మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. వారికి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాల హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను బీఆరెస్ శ్రేణులు ప్రజల్లో సమర్ధవంతంగా తిప్పికొట్టాలన్నారు.


వచ్చేది బీఆరెస్ ప్రభుత్వమేనని, పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో అలసత్వం వహించకుండా పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. బీఆరెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఎన్నికల హామీలను ప్రజలకు వివరించాలని, ముఖ్యంగా పథకాల లబ్ధిదారులను సంప్రదించి వారి ఓట్ల సాధనకు కృషి చేయాలన్నారు.