మునుగోడులో పోటీకి సీపీఐ తీర్మానం

మునుగోడులో పోటీకి సీపీఐ తీర్మానం

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కాంగ్రెస్ పొత్తులో భాగంగా బలమైన పార్టీ క్యాడర్, గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సీపీఐకి మునుగోడు సీటు కేటాయించాలని లేదా సొంతంగా పోటీకి అనుమతి ఇవ్వాలని ఆపార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లాలో బలమైన ఉద్యమ చరిత్ర ఉన్న మునుగోడు స్థానాన్ని సీపీఐకి కేటాయించాలని, లేని పక్షంలో సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని జాతీయ, రాష్ట్ర కమిటీలను జిల్లా కౌన్సిల్ సమావేశంలో కోరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులో ప్రతిసారీ మునుగోడు నియోజకవర్గం సీపీఐకి కేటాయించకపోవడంతో పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యురాలు గిరి రామ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, ఆర్ అంజచారి, బోల్గురి నర్సింహా, టీ వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, గురుజా రామచంద్రం, బొడ్డుపల్లి వెంకట్ రమణ పాల్గొన్నారు.