జాబ్ క్యాలెండర్ రూపొందించాలనడం సాహసోపేత నిర్ణయం: తలసాని
విధాత,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమైనదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.దీంతో నిరుద్యోగులకు తగిన ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తమ శాఖలో ఖాళీలకు గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అధికారులు సమన్వయం చేసుకొని పశుసంవర్ధక, మత్స్య శాఖల లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు,కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను సమగ్ర నివేదిక […]

విధాత,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమైనదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.దీంతో నిరుద్యోగులకు తగిన ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తమ శాఖలో ఖాళీలకు గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అధికారులు సమన్వయం చేసుకొని పశుసంవర్ధక, మత్స్య శాఖల లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు,కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను సమగ్ర నివేదిక రూపంలో అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
నూతనంగా ఏర్పడిన జిల్లాలు, మండలాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నివేదికలను సిద్దం చేయాలని సూచించారు. ఇటీవల అమలులోకి వచ్చిన నూతన జోనల్ విధానంతో కూడా ఏర్పడే ఖాళీలను గుర్తించి నివేదికలో పొందుపరచాలని అన్నారు. పూర్తిస్థాయిలో ఖాళీల సమాచారం అందజేయాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖలను ఆదేశించారు.రిటైర్ అయ్యే ఉద్యోగులతో ఏ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరం భర్తీ చేసేలా ముఖ్యమంత్రి కార్యాచరణను రూపొందిస్తున్నారని మంత్రి తెలిపారు. జాబ్ క్యాలెండర్ అమలుతో ప్రభుత్వం పై ఆర్ధికంగా ఎంతో భారం పడుతుంది.అయినా ముఖ్యమంత్రి ఎంతో సాహసంతో ముందుకు వెళుతున్నారనిమంత్రి తలసాని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతం సాధించారు.తెలంగాణా కు హరితహారం.కార్యక్రమంతో కోట్లాది మొక్కలను నాటిన ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం ఎంతో అభివృద్ధి చెందింది. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తో భారీగా సాగుభూముల విస్తీర్ణం పెరిగిందని అన్నారు.