హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి రోజు ఏసీ బస్సు : మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి ప్రతి రోజూ ఒక ఏసీ బస్సును నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పేర్కొన్నారు. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సోమవారం ఆయన దర్శించుకున్నారు.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి ప్రతి రోజూ ఒక ఏసీ బస్సును నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పేర్కొన్నారు. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామి, అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి మండలం నుంచి జిల్లాకేంద్రానికి ఓ ఏసీ బస్సును నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అవసరమైతే మండల కేంద్రం నుంచి స్థానికుల అవసరాలుంటే హైదరాబాద్‌కు ఏసీ బస్సును వేయనున్నట్లు తెలిపారు. హామీ ఇచ్చిన విధంగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేశామని.. ప్రస్తుతం రూ.1.50లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. త్వరలోనే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారని.. వారిపై నిధుల కోసం ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకుంటామని పొన్నం పేర్కొన్నారు