డెయిరీ మిల్క్ చాక్లెట్స్.. పిల్ల‌ల‌కు మ‌హా ఇష్టం. ఆ చాక్లెట్స్‌ను క్ష‌ణాల్లో తినేస్తుంటారు. కానీ ఈ వీడియోను చూస్తే మీరు డెయిరీ మిల్క్ చాక్లెట్ల‌ను దూరంగా పెట్టే అవ‌కాశం ఉంది

హైద‌రాబాద్ : డెయిరీ మిల్క్ చాక్లెట్స్.. పిల్ల‌ల‌కు మ‌హా ఇష్టం. ఆ చాక్లెట్స్‌ను క్ష‌ణాల్లో తినేస్తుంటారు. కానీ ఈ వీడియోను చూస్తే మీరు డెయిరీ మిల్క్ చాక్లెట్ల‌ను దూరంగా పెట్టే అవ‌కాశం ఉంది. ఓ సూప‌ర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో ఓ పురుగు ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

అమీర్‌పేట్ మెట్రో స్టేష‌న్ స‌మీపంలోని ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్‌లో ఓ వ్య‌క్తి ఈ నెల 9వ తేదీన రాత్రి 7:30 గంట‌ల స‌మ‌యంలో క్యాడ్‌బ‌రి డెయిరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. ఇక ఇంటికి వెళ్లిన అత‌ను చాక్లెట్ తిందామ‌ని ఓపెన్ చేయ‌గా, దాంట్లో నుంచి ఓ పురుగు ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో షాక్‌కు గురైన అత‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశాడు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల‌కు కూడా బాధితుడు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘ‌ట‌న‌పై క్యాడ్‌బ‌రి కంపెనీ కూడా స్పందించింది. ఈ ఘ‌ట‌న‌కు చింతిస్తున్నామ‌ని, ఆ వ్య‌క్తిని క్ష‌మాప‌ణ‌లు కోరింది. ఇక నుంచి త‌ప్ప‌కుండా క్వాలిటీ మెయింటెన్ చేస్తామ‌ని స‌ద‌రు కంపెనీ స్ప‌ష్టం చేసింది.

మొత్తానికి అమీర్‌పేట్ ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్‌ను ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు త‌నిఖీలు చేశారు. అక్క‌డున్న డెయిరీ మిల్స్ ఉత్ప‌త్తుల‌ను ప‌రిశీలించారు. కొన్ని చాక్లెట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తో చిన్న పిల్లలకు చాకెట్లను కొనాలి అంటేనే భయాందోళనకు గురి అవుతున్నారు తల్లిదండ్రులు. దీనిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు అధికారులు కోరుతున్నారు.

Somu

Somu

Next Story