అజారుద్దీన్ పై నాలుగు కేసులు.. ఎన్నికల వేళ టెన్షన్

విధాత : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పై రాచకొండ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. హెచ్‌సీఏ లో అవినీతికి సంబంధించి ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజారుద్ధిన్‌పై తాజాగా ఈ కేసులు నమోదు కావడంతో బెయిల్ కోసం మల్కాజ్‌గిరి కోర్టును ఆయన ఆశ్రయించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, థర్డ్ పార్టీకి పనులు ఇచ్చి అవినీతి పాల్పడ్డారన్న ఆరోపణలతో అజార్‌పై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో అవినీతి కేసులు నమోదుకావడం అజారుద్ధిన్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.