ఉద్యోగార్థులకు 50 రోజుల పాటు ఉచిత శిక్షణ: అమిత్ కుమార్ రెడ్డి
విధాత: ఇటీవల పోలీస్ (ఎస్సై, కానిస్టేబుల్)దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు, గ్రూప్ 4 ఎగ్జామ్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 రోజులపాటు నల్గొండ లోని TNGO'S bhavan లో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గత నెలలో 20వేలకు పైగా ఉద్యోగాలకు […]

విధాత: ఇటీవల పోలీస్ (ఎస్సై, కానిస్టేబుల్)దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు, గ్రూప్ 4 ఎగ్జామ్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 రోజులపాటు నల్గొండ లోని TNGO’S bhavan లో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గత నెలలో 20వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా నుండి అత్యధికంగా యువకులు ఉద్యోగాలు సాధించేందుకు తమ వంతుగా సహకారం అందించడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగా పోలీసు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయిన అభ్యర్థులకు మేకల అభినవ్ స్టేడియంలో దాదాపు 30 వేల మందికి పౌష్టికాహారం అందించినట్లు ఆయన తెలిపారు. ఫిజికల్ టెస్ట్ లలో అర్హత సాధించిన అందరికీ కూడా మెయిన్స్ లో అర్హత సాధించే విధంగా పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అమిత్ రెడ్డి తెలిపారు.
అలాగే గ్రూప్4 కు సంబంధించి అత్యధిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నందున వారికి జనవరి 29న నల్గొండ లోని పోలీసు ఆడిటోరియంలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. స్క్రినింగ్ టెస్ట్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఫిబ్రవరి 2 నుండి మార్చి చివరి వరకు దాదాపు 50 రోజులపాటు అర్హత కలిగిన అభ్యర్థులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అమిత్ రెడ్డి కోరారు .
సమావేశంలో నల్గొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, ఫోకస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఐతగొని స్వామి గౌడ్, గోపాల్ రెడ్డి, దుబ్బ అశోక్ సుందర్, మునస వెంకన్న, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.