Heavy Rains | తెలంగాణ‌కు నేడు భారీ వ‌ర్ష‌సూచ‌న‌.. మ‌ధ్యాహ్నం నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు కుండ‌పోత వ‌ర్షం..!

Heavy Rains | తెలంగాణ‌( Telangana )లోని నైరుతి రుతుప‌వ‌నాలు( Monsoon ) ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల ముందుగానే నైరుతి రుతుప‌వ‌నాలు( Monsoon ) ప్ర‌వేశించ‌డంతో.. రాష్ట్రంలో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం( Weather ) మారిపోయింది.

Heavy Rains | తెలంగాణ‌కు నేడు భారీ వ‌ర్ష‌సూచ‌న‌.. మ‌ధ్యాహ్నం నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు కుండ‌పోత వ‌ర్షం..!

Heavy Rains | తెలంగాణ‌( Telangana )లోని నైరుతి రుతుప‌వ‌నాలు( Monsoon ) ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల ముందుగానే నైరుతి రుతుప‌వ‌నాలు( Monsoon ) ప్ర‌వేశించ‌డంతో.. రాష్ట్రంలో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం( Weather ) మారిపోయింది. ఎండ‌లు, ఉక్క‌పోత నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది. దీంతో చ‌ల్ల‌ని వాతావర‌ణాన్ని ప్ర‌జ‌లు ఆస్వాదిస్తున్నారు.

సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ 8 నుంచి 12వ తేదీల మ‌ధ్య రుతుప‌వ‌నాలు( Monsoon ) రాష్ట్రాన్ని తాకుతాయి. ఈసారి సాధార‌ణ అంచ‌నా క‌న్న 16 రోజులు ముందుగానే అంటే మే 26వ తేదీన రాష్ట్ర ద‌క్షిణ స‌రిహ‌ద్దు జిల్లాల‌ను రుతుప‌వ‌నాలు తాకాయి. గ‌తేడాది జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవ‌నాలు ప్ర‌వేశించాయి.

రుతుప‌వ‌నాల‌కు తోడు బంగాళాఖాతం( Bay of Bengal )లో అల్ప‌పీడ‌నం( Low Pressure ) కొన‌సాగుతోంది. దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ( Weather Department ) హెచ్చ‌రించింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్‌మ్యాన్( Telangana Weatherman ) హెచ్చ‌రించారు. అర్ధరాత్రి వేళ కూడా వాన‌లు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 100 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఇవాళ కూడా మే 21 నాటి ప‌రిస్థితి పున‌రావృతం అయ్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు, రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.