భూ యజమాన్యహక్కును నిర్దారించే పరిధి హైకోర్టుకు లేదు
భూ యజమాన్య హక్కులను నిర్దారించే పరిధి హైకోర్టుకు లేదని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు సింగ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సీజే బెంచ్ రద్దు చేసింది

సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసిన ద్విసభ్య ధర్మాసనం
విధాత: భూ యజమాన్య హక్కులను నిర్దారించే పరిధి హైకోర్టుకు లేదని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు సింగ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సీజే బెంచ్ రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగుల పల్లి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని వివాదా స్పద భూమిలో టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని దాఖలు చేసిన రిట్ పిటీషన్‌లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్ తీవ్రంగా స్పంధించింది. సింగిల్ బెంజ్ ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల రద్దు చేసింది. యజమాన్యహక్కుల విషయమై ఇప్పటికే సోహన్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, థాన్ సింగ్, నాథ్మల్ వర్సెస్ సూపరింటెండెంట్ ఆఫ్ టాక్సెస్, కేసుల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసినట్లు ధర్మాసనం తెలిపింది.
వట్టినాగుల పల్లి గ్రామంలో శంకర్ హిల్స్ లేఅవుట్ ఉందని, ఈ లేఅవుట్‌లోని తమ ప్లాట్లకు విద్యుత్ సంస్థ అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇవ్వనిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గోపు నాగమణి తదితరులు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన సింగిల్ బెంచ్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ కేసులోతమను ఇంప్లీడ్ చేయాలంటూ జైహింద్ గ్రీన్ ఫీల్డ్ ఎల్ ఎల్‌పీ చేసిన పీటీషన్‌ను తిరస్కరించిన సింగిల్ బెంచ్ తమ సమయాన్ని వృధా చేసినందుకు వేయి రూపాయలు జరిమాన కూడా విధించింది. ఈ సంస్థకు ఆ భూములపై హక్కులు లేవని చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జైహింద్ గ్రీన్ ఫీల్డ్ ఎల్ ఎల్‌పీ సంస్థ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టీస్ అలోక్ అరాధే, జస్టీస్ జె. అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విద్యుత్ కనెక్షన్‌ల మంజూరు చేయడానికి ఉన్న నిబంధనలను పరిగణలోకి తీసుకోవడంలో సింగిల్ జడ్జీ విఫలమయ్యారని తెలిపింది.
భూ యజమాన్య హక్కులను రిట్ పీటీషన్‌లో ఎలా నిర్దారిస్తారని ద్విసభ్య ధర్మాసనం అన్నది. రిట్‌పిటీషన్‌లో యజమాన్య హక్కులను నిర్దారించే పరిధి హైకోర్టుకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ భూముల యజమాన్యహక్కులపై కేసులు సివిల్ కర్టులో ఉన్నందున సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. నిబంధనల ప్రకారమే విద్యుత్ సంస్థలు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలన్న ధర్మాసనం, ఈ ప్రక్రియకు ముందు జైహింద్ గ్రీన్ ఫీల్డ్ వాదనలు వినాలని సూచించింది.