కూక‌ట్‌ప‌ల్లి మెట్రో స్టేష‌న్ ప‌క్క‌న‌ భారీ అగ్నిప్ర‌మాదం..

కూక‌ట్‌ప‌ల్లి మెట్రో స్టేష‌న్ ప‌క్క‌న‌ భారీ అగ్నిప్ర‌మాదం..

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో త‌రుచుగా ఎక్క‌డో ఒక‌చోట అగ్నిప్ర‌మాదాలు సంభ‌విస్తూనే ఉన్నాయి. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో కూక‌ట్‌ప‌ల్లి కేపీహెచ్‌బీ మెట్రో స్టేష‌న్ ప‌క్క‌న ఉన్న ఓ ఫ‌ర్నిచ‌ర్ షాపులో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.


ఈ ప్ర‌మాదం కార‌ణంగా మూడు షాపులు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. దీంతో రూ. 40 ల‌క్ష‌ల మేర ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు బాధితులు పేర్కొన్నారు. ఇక మెట్రో స్టేష‌న్ ప‌క్క‌నే అగ్నిప్ర‌మాదం సంభ‌వించ‌డంతో.. మెట్రో ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. స్థానికులు, వాహ‌న‌దారులు భ‌యంతో ప‌రుగులు తీశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది.