తెలంగాణలో మేం వ‌స్తే బీసీని సీఎం చేస్తాం: అమిత్ షా

తెలంగాణలో మేం వ‌స్తే బీసీని సీఎం చేస్తాం: అమిత్ షా

విధాత : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. సూర్యాపేట బీజేపీ జన గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆరెస్‌లు రెండు కుటుంబ పార్టీలేనన్నారు. సోనియాగాంధీ తన కొడుకు రాహుల్‌ను ప్రధాని చేయాలని, సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.


ఆ రెండు పార్టీలు కుటుంబాల కోసమే తప్ప ప్రజల కోసం పనిచేయవన్నారు. గతంలో సీఎం కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తామని, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఈ దఫా అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తారా అంటూ ప్రశ్నించారు. బీఆరెస్ దళిత, గిరిజన, బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అమిత్ షా ప్రకటనతో సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ కంటే ఓ అడుగు ముందుకేసినట్లయ్యింది. అలాగే బీఆరెస్‌, కాంగ్రెస్‌లను ఎన్నికల్లో ఓడించేందుకు బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తేవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ కానుంది.