దేవరకొండ కాంగ్రెస్‌లో చేరికలు
ఉమ్మడి నల్గొండ: దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఒకటో వార్డు కౌన్సిలర్ పోన్నబోయిన భూదేవి-సైదులు తమ అనుచరులు 300 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఒకటో వార్డు కౌన్సిలర్ పోన్నబోయిన భూదేవి-సైదులు తమ అనుచరులు 300 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.