ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి కేటీఆర్‌

ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి కేటీఆర్‌

విధాత : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సరళీకృత ఆర్ధిక విధానాల వల్లనే లూలు గ్రూప్‌ రాష్ట్రంలో 3,500కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందని, అందులో భాగంగానే 300కోట్లతో మాల్‌, హైపర్‌ మార్కెట్‌ ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం కూకట్‌పల్లిలో లూలు గ్రూప్‌ ఏర్పాటు చేసిన మాల్‌, హైపర్‌ మార్కెటింగ్‌ సెంటర్‌ను ఆ సంస్థ చైర్మన్‌ యూసఫ్‌ అలీతో కలిసి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు.



 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ లూలు గ్రూప్‌ త్వరలో మరిన్ని సూపర్‌ మార్కెట్‌లు, మాల్స్‌, ఫుడ్‌ కోర్టులు, ఫ్రాసెసింగ్‌ యూనిఉట్ల ఏర్పాట్లు చేయబోతుందన్నారు. వాటితో యువతకు ఉపాధితో పాటు ఆక్వా, ఫౌల్ట్రీ రంగాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా లూలు గ్రూపు చైర్మన్‌ యూసఫ్‌ అలీ మాట్లాడుతూ త్వరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు శంకుస్థాపన చేస్తామన్నారు.