బ‌జారు భాష మాట్లాడడం వేరు.. ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం వేరు.. రేవంత్‌కు కేసీఆర్ చుర‌క‌లు

బ‌జారు భాష మాట్లాడడం వేరు.. ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం వేరు అని మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి కేసీఆర్ చుర‌క‌లంటించారు. అప్పుల గురించి మాట్లాడుతూ కేసీఆర్

బ‌జారు భాష మాట్లాడడం వేరు.. ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం వేరు.. రేవంత్‌కు కేసీఆర్ చుర‌క‌లు

 

బ‌జారు భాష మాట్లాడడం వేరు.. ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం వేరు అని మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి కేసీఆర్ చుర‌క‌లంటించారు. అప్పుల గురించి మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.బ‌జారు భాష మాట్లాడం వేరు.. ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం వేరు. చాలా బాధ్య‌త‌తో కూడుకున్న విష‌యం. అధికారులు య‌థాలాపంగా అంత ఐఏఎస్ రాజ్యం ఉంట‌ది. అప్పుడున్న అధికారులు లెక్క‌లు క‌ట్టి బ‌డ్జెట్ ముంద‌ర పెట్టారు. ఎవ‌రు చెప్పారు బ‌డ్జెట్ చేయ‌మ‌ని అడిగాను. అవ‌స‌రాలు ఏంటి..? పున‌ర్ నిర్మాణం ఏంటి..? అని ప్ర‌శ్నించాను. 28 రోజులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ముందుకు పోయాం. తెలివి ఉన్న‌వారు, లేని వారు, అవగాహ‌న లేని వారు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ప్ర‌ధాన ఆరోప‌ణ అప్పులు అని కాంగ్రెస్ నాయ‌కులు చేశారు. ఈ ప్ర‌పంచంలో అత్యధిక ధ‌నిక దేశం అమెరికా.. అత్య‌ధిక అప్పుల దేశం కూడా అమెరికానే. అమెరికా ఎక‌నామి ఇవాళ 27 ట్రిలియ‌న్ డాల‌ర్స్. చైనా 18,566 డాల‌ర్లు, జ‌ర్మ‌నీ 4 ట్రిలియ‌న్ డాల‌ర్లు, జ‌పాన్ 4 ట్రిలియ‌న్ డాల‌ర్లు, ఇండియా 4 ట్రిలియ‌న్ డాల‌ర్లు. ఇది ప‌క్క‌న పెడితే.. ఇండియాలో అప్పుల్లో 24 రాష్ట్రాల‌కు దిగువ‌న తెలంగాణ‌ ఉంది. 23 రాష్ట్రాలు ఎగువ‌న ఉన్నాయి. 1940లో క‌మ్యూనిస్టులు మాట్లాడిన భాష అప్పులు. ప్ర‌భుత్వానికి ఉండే అప్పులు వేరు. కుటుంబానికి ఉండే అప్పులు వేరు అని కేసీఆర్ తెలిపారు.

బ‌డ్జెట్ కూర్పులో స్టేట్ ఓన్ రెవెన్యూ ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ క‌లిపి ఉంటాయి.. ఇది మొద‌టి కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ స్టేట్ షేర్ ఇన్ సెంట్ర‌ల్ ట్యాక్సెస్.. ఏ ట్యాక్స్‌లు రాష్ట్రం, కేంద్రం వ‌సూలు చేయాల‌నేది ఉంటుంది. కేంద్రానికి పెట్టిన ట్యాక్సుల్లో అన్ని రాష్ట్రాల‌కు ఇవ్వాలి. ఎగ్గొట్టాడానికి వీల్లేదు. మూడోది కేంద్రంఅమ‌లు చేసే ప‌థ‌కాల్లో వ‌చ్చే డ‌బ్బులు.. ఇవి సెంట్ర‌ల్ గ్రాంట్స్. నాలుగోది మార్కెట్ బారోయింగ్. ఇది బ‌డ్జెట్‌లో భాగం. ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌కు, ప్ర‌యివేటు వ్య‌క్తి బ‌డ్జెట్‌కు డిఫ‌రెంట్ ఉంటుంది అని కేసీఆర్ తెలిపారు.

అప్పుల గురించి.. మీరు ఎఫ్ఆర్బీఎం ప‌రిమితి 25 శాతం అయితే 27 శాతం పైన అప్పులు తెచ్చార‌ని ఆరోప‌ణ‌. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది వారి అజ్ఞానం. అది బోగ‌స్ శ్వేత‌ప‌త్రం. చ‌రిత్ర తెలియ‌ని అజ్ఞానులు కాంగ్రెస్ నాయ‌కులు. మాకుండే ప‌రిమితికి లోబ‌డి అప్పుల్లో మేం ఉన్నాం. న‌రేంద్ర మోదీ ప్ర‌తిప‌క్ష ప్ర‌భుత్వాల‌ను దెబ్బ‌కొట్టాల‌నే ఉద్దేశంతో ఎన్నిక‌ల‌కు మూడేండ్ల ముందు అప్పులు కంట్రోల్ చేశారు. లేక‌పోతే జీఎస్డీపీ 16 ల‌క్ష‌ల కోట్ల‌కు పోయేది. ప్ర‌స్తుతం 14 ల‌క్ష‌ల కోట్ల దాకా ఉంది. మోదీ రాష్ట్రాల‌కు అప్పుల‌ను క‌ట్ చేశారు. వివిధ కంపెనీల నుంచి వ‌చ్చే ఫండింగ్ కూడా రాకుండా చేశారు. గాలి మాట‌లు మాట్లాడొద్దు. ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ప్ర‌తి నయా పైసా కాగ్ లెక్క‌లు క‌డుతుంది. రాజ్యాంగ‌బ‌ద్దంగా చ‌ట్ట‌బ‌ద్దంగా హౌజ్‌లో టేబుల్ పై పెడుతారు. ఆనాడు ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ భ‌ట్టి విక్ర‌మార్క చూసుకోలేదా.. చ‌ద‌వుకోలేదా.. దాన్ని మీద కూడా రోప‌ణ‌లు చేస్త‌మంటే స‌రికాదు. ఒక చిలిపి రాజ‌కీయ వికృత క్రీడ ఇది అని కేసీఆర్ తెలిపారు.