కానిస్టేబుల్ క్రిష్ణయ్య బిడ్డ వైద్య విద్యకు కేసీఆర్ సహాయం

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ క్రిష్ణయ్య బిడ్డ వైద్య విద్య కోసం బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 25లక్షల ఆర్థికసాయం అందించారు.

కానిస్టేబుల్ క్రిష్ణయ్య బిడ్డ వైద్య విద్యకు కేసీఆర్ సహాయం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ క్రిష్ణయ్య బిడ్డ వైద్య విద్య కోసం బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 25లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకల వేళ కేసీఆర్ కానిస్టేబుల్ క్రిష్ణయ్య కుటుంబంతో కలిసి భోజనం చేశారు.


కుటుంబ సభ్యులు బాగోగులపై చర్చించారు. క్రిష్ణయ్య కూతురు ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీ చదువాల్సిన నేపథ్యంలో అందుకు అవసరమైన 25లక్షలను ఆర్థిక సహాయంగా కేసీఆర్ వారికి అందించారు.