దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. కాంగ్రెస్‌పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

రాష్ట్రంలో ప్ర‌స్తుతం దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అనే అంశం టాపిక్ కొన‌సాగుతోంద‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అడ్డ‌గోలు హామీలివ్వ‌డంతో 1.8 ఓట్లు ఎక్కువ రావ‌డంతో

దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. కాంగ్రెస్‌పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

రాష్ట్రంలో ప్ర‌స్తుతం దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అనే అంశం టాపిక్ కొన‌సాగుతోంద‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అడ్డ‌గోలు హామీలివ్వ‌డంతో 1.8 ఓట్లు ఎక్కువ రావ‌డంతో వారు గెలిచారు. రైతాంగం విల‌విల‌లాడుతోంది. ప‌రిస్థితులు స‌రిగా లేవు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో న‌డుస్తున్న‌ది.. దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. సీఎం, ఇత‌ర మంత్రులు తిడుతున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే ఫ్ర‌స్టేష‌న్‌కు గుర‌వుతున్నారు. వారి స‌భ‌లు అట్ట‌ర్ ఫ్లాప్ అవుతున్నాయి. త‌ర్వాత సోష‌ల్ మీడియా వికృత‌రూపం చూపిస్తుంది. 18 రోజుల్లో 700 కోట్ల బీర్లు తాగేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. బాకా, కాకా చానెల్స్ కానీ కొన్ని ర‌కాల పత్రికాలు కానీ కేసీఆర్ తాగుబోతుల‌ను చేశార‌ని, బీర్ల అమ్మ‌కాలు పెరిగితే ఎండ‌తాపం వ‌ల్ల తాగుతున్నార‌ని స‌మ‌ర్థించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది ప్ర‌స్తుతం జ‌రుగుతుంది.

కేసీఆర్ ఈజ్ హిస్ట‌రీ ఆఫ్ తెలంగాణ‌. కేసీఆర్‌ను త‌గ్గించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేసి భంగ‌ప‌డి విఫ‌ల‌మ‌య్యారు. నేను పెర‌గాల్సిన ఎత్తుకు పెరిగాను. న‌న్ను త‌గ్గించ‌డం అనేది ఉండ‌దు. ఒక చిలిపి రాజకీయ వికృత క్రీడ‌. ఇది కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయి. విలీనం చేస్తామ‌ని చెప్పిన మాట వాస్త‌వం. వారు విన‌ని మాట కూడా వాస్త‌వం. రాష్ట్రం ఏర్ప‌డ్డాక కంబైన్డ్ స్టేట్‌లో ఎల‌క్ష‌న్స్ ఏంట‌ని అడిగాను. వారు విన‌లేదు. ఆ త‌ర్వాత నేను విలీనం చేయ‌లేదు. మే గెలిచి ప‌దేండ్లు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వారు అధికారంలోకి వ‌చ్చారు.