బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు: కిషన్ రెడ్డి
కాంగ్రెస్‌లో చేరకపోతే మీ అక్రమ దందాలను బయటకు తీస్తామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు

కాంగ్రెస్‌లో చేరకపోతే మీ అక్రమ దందాలను బయటకు తీస్తామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు
విధాత : కాంగ్రెస్‌లో చేరకపోతే మీ అక్రమ దందాలను బయటకు తీస్తామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఆ మంత్రి సంగతి, ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాకా ఆ మాటలన్ని ఉత్తుత్తి మాటలనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇందుకు సీఎంగా రేవంత్‌రెడ్డి బీఆరెస్ వాళ్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడమే నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రాహుల్‌గాంధీ గ్యాంగ్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ(ఆర్‌జీ) టాక్స్ వేస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బిల్డర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను, కంపెనీలను అందరిని ఢిల్లీలోని రాహుల్ గాంధీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీఆరెస్ కనుమరుగవుతుందన్నారు.
ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు సైతం పోటీకి వెనుకడుగు వేసి తప్పుకోవడం చూస్తే పార్లమెంటు ఎన్నికల తర్వారా ఆ పార్టీ మరింత పతనం కాకతప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత నెలకొంటుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని, కాంగ్రెస్, బీఆరెస్‌లకు ఓటు వేసి వారి ఓటును వృధా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఖచ్చితంగా తెలంగాణలోని 17స్థానాల్లో డబుల్ డిజిట్ స్థానాలు బీజేపీ గెలవబోతుందన్నారు.