కాంగ్రెస్ మమ్మల్ని సంప్రదించకుండానే జాబితా ప్రకటించింది:కోదండ రామ్
కాంగ్రెస్‌తో పొత్తుల విషయంపై మంగళవారం మా పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కోదండరామ్ తెలిపారు. కాంగ్రెస్-టీజేఎస్‌ల పొత్తుల అంశంపై చర్చలు జరిపారు

విధాత, హైద్రాబాద్ : కాంగ్రెస్‌తో పొత్తుల విషయంపై మంగళవారం మా పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ తెలిపారు. సోమవారం కాంగ్రెస్-టీజేఎస్‌ల పొత్తుల అంశంపై కోదండరామ్, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిలు చర్చలు జరిపారు. చర్చల అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ తాము ఆరు సీట్లు కోరామని, అయితే తమను సంప్రదించకుండానే కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించిందన్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తుల అంశంపై ఏమి చేయాలన్నది మా పార్టీలో చర్చించి మంగళవారం మా పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.