మునుగోడులోనే కాదు గజ్వేల్‌లోను పోటీ చేస్తా: రాజగోపాల్ రెడ్డి

విధాత, హైదరాబాద్: బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీట్ల వేటలో పడ్డారు. బుధవారం ఆయన ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు. మునుగోడుతో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లోనూ పోటీకి సంసిద్ధత వ్యక్తం చేస్తూ, రెండు టికెట్లు కేటాయించాలని ఆయన వద్ద ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.
పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వేణుగోపాల్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖరారుపై సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీఆరెస్ ను గద్దె దించాలని వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బలమైన నేతలను రంగంలోకి దించేందుకు వేచి చూస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందనే చర్చ జరుగుతోంది.