వేముల వీరేశం గెలుపు ఖాయం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వేముల వీరేశం గెలుపు ఖాయం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం 50 వేల మెజారిటీతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నకిరేకల్ నియోజకవర్గం నుంచి బీఆరెస్ కు చెందిన పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు భారీ ఎత్తున కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు.


అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆరెస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నకిరేకల్ కౌన్సిలర్లు 8వ వార్డు పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి, 9వ వార్డు చెవుగోని రజిత – శ్రీనివాస్, 15వ వార్డు యాసారపు లక్ష్మి – వెంకన్న, 5వ వార్డు యువనాయకులు వంటేపాక శ్రీకాంత్, వల్లభాపురం సర్పంచ్ (ఎంపీటీసీ), ఓగోడ్ ఎంపీటీసీ, పీఏసీఎస్ చైర్మన్, మాజీ సర్పంచులు, చిట్యాల నుండి మాజీ ఎంపీపీ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, తాళ్లవెల్లంల సర్పంచ్, ఎంపీటీసీ, వెంబాయి సర్పంచ్, పేరేపల్లి సర్పంచ్, ఉద్యమ నాయకులు, మాజీ సర్పంచులు, దేవాలయ కమిటీ చైర్మన్, వార్డు మెంబర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కాంగ్రెస్ లో చేరారు. నార్కెట్‌పల్లి మాండ్ర, యం యెడవల్లి, చిన్నతుమ్మలగూడెం సర్పంచులు, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు, నాయకులు చేరారు.


కట్టంగూర్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు మాద యాదగిరి, అయిటిపాముల, బోల్లెపల్లి, ఈదులుర్, మునుకుంట్ల, ముత్యాలమ్మగూడెం, ఇస్మాయిల్ పల్లి సర్పంచులు, చెర్వుఅన్నారం ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు చేరారు. కేతపల్లి మండలం నుండి మాజీ ఎంపీపీ, కొర్లపాహడ్, కాసానగోడు ఎంపీటీసీలు, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు చేరారు. రామన్నపేట మండలం నుండి రామన్నపేట పట్టణ సర్పంచ్, దుబ్బాక ఎంపీటీసీ, సింగల్ విండో డైరెక్టర్, వివిధ గ్రామాల వార్డుల మెంబర్లు, నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.