కోరం కనకయ్య నామినేషన్ దాఖలు..టికెట్ తనకే వస్తుందని ధీమా

విధాత, ఇల్లందు: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య శనివారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. కోరం ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యేగా నియోజవర్గంలో కోరం కనకయ్య రాజకీయంగా గుర్తింపు పొందారు.