కాంగ్రెస్ ను నమ్మితే గోస పడతాం: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

కాంగ్రెస్ పాలనంతా ద్రోహం, నయవంచన అని, వారు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మితే మోసపోతాం.. గోస పడతామని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు

కాంగ్రెస్ ను నమ్మితే గోస పడతాం: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: కాంగ్రెస్ పాలనంతా ద్రోహం, నయవంచన అని, వారు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మితే మోసపోతాం.. గోస పడతామని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 6, 7 డివిజన్లో ఎమ్మెల్యే చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో మాట్లాడారు.


60 ఏళ్ల కాంగ్రెస్ పాలన మూలంగానే తెలంగాణలో ప్రజలకు కష్టాలు నెలకొన్నాయని అన్నారు. సంక్రాంతి సమయంలో గంగిరెద్దుల వాళ్లు వచ్చే విధంగా, హైదరాబాదులో భూకబ్జాలు, దందాలు చేసి సంపాదించిన డబ్బు సంచులతో వచ్చే నాయకుల మాటలను ప్రజలు నమ్మ వద్దన్నారు. ఎన్నికల సమయంలో రావడం… ఎన్నికలయ్యాక పోవడం మాత్రమే వారికి తెలుసన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రామగుండం కార్పొరేషన్ లో రూ.350 కోట్ల నిధులతో అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు.


మెడికల్ కళాశాలను ఈ ప్రాంతంలో ప్రారంభింపచేశామన్నారు. కరకట్ట నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలకు ప్రజలు ఎవరూ మోసపోవద్దని, మనకోసం, మా సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి, కార్పొరేటర్ కాల్వ స్వరూప శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యురాలు తస్నీంభాను, నాయకులు గంగ శ్రీనివాస్, అచ్చె వేణు ,పీచర శ్రీనివాస్, కనకం శాంసన్, జహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, చిన్నాల విజయ్ కుమార్, గుంపుల ఓదెలు, నారాయణదాసు మారుతి , బెంద్రం రాజిరెడ్డి, పెసరి స్వామి, వంగ వీరస్వామి, నూనే లతమోహన్, విశాల్ ఠాగూర్, వేణు నారాయణ పాల్గొన్నారు.