భౌతిక దాడులకు కాంగ్రెస్ యత్నం: ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్‌

భౌతిక దాడులకు కాంగ్రెస్ యత్నం: ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్‌

విధాత : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ఎక్స్ వేదికగా ఖండించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తెలంగాణలోని నాయకులపై భౌతిక దాడులకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ట్వీట్‌లో ఆరోపించారు. థర్డ్ రేటెడ్ క్రిమినల్ అయిన పీసీసీ ప్రెసిడెంట్ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నానన్నారు.