పట్టుబడిన ఆ 42కోట్లు కాంగెస్‌ వే.. మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు

కర్ణాటకలో అంబికాపతి ఇంట్లో పట్టుబడిన 42కోట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తరలించేందుకు సిద్ధం చేసిన డబ్బులేనని

పట్టుబడిన ఆ 42కోట్లు కాంగెస్‌ వే.. మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు

విధాత : కర్ణాటకలో అంబికాపతి ఇంట్లో పట్టుబడిన 42కోట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తరలించేందుకు సిద్ధం చేసిన డబ్బులేనని మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబికాపతి ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డికె. శివకుమార్‌ సన్నిహితుడేనన్నారు. తెలంగాణలో 1500కోట్ల డబ్బులను పంచి గెలిచేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుందన్నారు. గతంలో కర్ణాటకలో 40శాతం కమిషన్‌ ప్రభుత్వం నడిస్తే, ఇప్పుడు 50శాతం ప్రభుత్వం నడుస్తు్దంటూ విమర్శించారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బులను తెలంగాణలో వినియోగించి గెలిచేందుకు కాంగ్రెస్‌ పన్నాగం చేస్తుందన్నారు. వలస నేతల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు సోషల్‌ మీడియాలో బలం తప్ప ప్రజాబలం లేదన్నారు.

అటు మంత్రి కేటీఆర్‌ సైతం కర్ణాటకలో పట్టుబడిన డబ్బులు కాంగ్రెస్‌వేనని, మేథో దివాళ తీసిన కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్ల కొనుగోలుకు కర్ణాటక నుంచి వందల కోట్ల డబ్బులు పంపిస్తోందని ట్వీట్‌లో ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన నాయకుడే ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో స్కాంగ్రెస్‌కును తరమికొట్టాలని ప్రజలను కోరారు.