ఎమ్మెల్యే వివేకానందపై కూనం ఫిర్యాదు

విధాత : ఓ ప్రైవేటు టీవి చానల్ నిర్వహించిన బహిరంగ చర్చలో తనపై భౌతిక దాడికి పాల్పడిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆరెస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ అభ్యర్ధి కూనం శ్రీశైలంగౌడ్ సూరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బహిరంగ చర్చలో తాను లేవనెత్తిన ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా దుర్భాషలాడుతూ నాపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వివేకానంద చర్యను ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. ఈ ఘటన పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.