ఏసీబీ వలలో మామడ ఎస్సై

ఏసీబీ వలలో మామడ ఎస్సై

విధాత ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ ఎస్సై రాజు రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టబడ్డాడు. మామడ మండలంలోని ఆనంతపెట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్ ఇటీవలే మరో వ్యక్తి తో గొడవ పడడంతో, మామడ ఎస్సై 323, 341, 291 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశాడు. రిమాండ్ చేస్తానంటూ చెప్పడంతో పాటు స్టేషన్ బెయిల్ కోసం ఎస్సై రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు.


లంచం ఇచ్చేందుకు బాధితులు సమ్మతించడంతో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో సల్కం సతీష్ అన్న ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఎస్సై లంచం డిమాండ్ చేసిన విషయాన్ని వారికి వివరించారు. పథకం ప్రకారం వారు ఎస్సైకు లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.