ఆయన వయసు 123 సంవత్సరాలట..! అవాక్కైన ఓటరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త ఓటరు కార్డులను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి

కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త ఓటరు కార్డులను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. కొందరి పేర్లు తప్పుగా నమోదు అయ్యాయి. మరికొందరి పుట్టిన తేదీలు తారుమారు అయ్యాయి. ఇంకొందరి అడ్రస్లు తప్పుగా ముద్రించబడ్డాయి.
కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన పొన్నం సత్యనారాయణ అనే వ్యక్తికి ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటరు కార్డు జారీ చేసింది. అందులో ఆయన వయసును 123 ఏండ్లుగా నమోదు చేసింది. ఈ ఓటరు కార్డును చూసి సత్యనారాయణ అవాక్కయ్యారు. ఆధార్ కార్డులో ఆయన 1954లో జన్మించినట్లుగా ఉంది. కానీ ఓటరు గుర్తింపు కార్డులో కొత్త ప్రింట్లో మాత్రంలో 1900, జనవరి 1వ తేదీన పుట్టినట్లు నమోదు చేశారు. ఓటరు కార్డులో తప్పుల తడకపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.