చిదంబరం వ్యాఖ్యలపై హరీశ్‌రావు కౌంటర్
తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిదని హరీశ్‌రావు కౌంటర్

- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా తెలంగాణ
- ట్విట్టర్ వేదికగా చిదంబరం వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన హరీశ్‌రావు
విధాత, హైదరాబాద్: తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిదని చిందబరానికి ట్విట్టర్‌వేదికగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది
తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది.