Minister Ponguleti Srinivas Reddy | ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి
విధి నిర్వహాణలో ఫోటోగ్రాఫర్లు (Photographers) ఎదుర్కోంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీనిచ్చారు

Minister Ponguleti Srinivas Reddy | విధి నిర్వహాణలో ఫోటోగ్రాఫర్లు (Photographers) ఎదుర్కోంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీనిచ్చారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం మాధాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని ఉత్తమ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఏదైనా ఫోటోలో జీవం ఉట్టిపడాలంటే ఫోటోగ్రాఫర్ ఎంతో అంకితాభావం, సృజన్మాతకతో పనిచేయాల్సివుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఫోటోగ్రఫీ ఎంపీకకు ఎంట్రీలు కోరితే 101 మంది ఫోటో జర్నలిస్టులు 900 ఫోటోలు పంపించారని ఈ ఫోటోలన్ని ఒకదాన్ని మించి మరొకటి ఉందని ప్రశంసించారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు మంత్రులుగా గడిచిన ఎనిమిది నెలల నుంచి మేము పడుతున్న కష్టాన్ని 15 నిమిషాల్లో ఫోటో ఎగ్జిబిషన్ లో చూపించారన్నారు. కళను అభిమానించడంతో పాటు దాంట్లోని ప్రావిణ్యతను ప్రదర్శిస్తూ దృశ్యాలను కంటికి కొట్టొచ్చినట్లు చూపిస్తున్న ఫోటో జర్నలిస్టులందరికీ మనస్పూర్తిగా ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలుపుతున్నాన్నారు. ప్రజలు మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తు , గత ప్రభుత్వ వైఫల్యాలను సరిచేస్తూ ముందుకెలుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి (K Srinivas Reddy)తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకు ముందు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఫోటో జర్నలిస్టుల సంఘం నిర్వహిచిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంపిటిషన్ ఎగ్జిబిషన్ ను మంత్రి ప్రారంభించారు.