కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఆగం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఖర్మ కాలి కాంగ్రెస్ వస్తే తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుందని మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రం లో మంత్రి క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు

కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఆగం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

– కేసీఆర్ ను విమర్శించే హక్కు రాహుల్ కు లేదు

– గాంధీ భవన్ స్క్రిప్ట్ నే చదివారు

– తెలంగాణ దోచుకోవడం గ్యారంటీ

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఖర్మ కాలి కాంగ్రెస్ వస్తే తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుందని మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రం లో మంత్రి క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్‌ తెలంగాణ కు వచ్చి ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపాలన చేస్తున్నారని అనడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కాంగ్రెస్ లో నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఉన్నది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు.

ఈ విషయం కూడా తెలియని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి కుటుంబపాలన గురించి మాట్లాడం చూస్తే అతని ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం అవుతున్నదన్నరు.గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగే ఉంటుందన్నారు. కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు రాహుల్ కు లేదన్నారు.ఇంకోసారి రాహుల్ గాంధీ తెలంగాణ పై, కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడి ప్రజలు తరిమికొడతారన్నారు. కాంగ్రెస్ హయాంలోఒక్క బీసీ మంత్రి త్వ శాఖ లేదని, ఇక్కడ కేసీఆర్ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి వారి గౌరవాన్ని పెంచారున్నారు.

కాంగ్రెస్ వస్తే దోపిడీ రాజ్యమే..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను దోచుకుని దాచుకుంటారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. రైతులకు మూడు గంటల కరెంట్ వస్తుందని , రైతు బంధు అందకుండా పోతుందని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కనుమరుగు అవుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో 10 మంది ముఖ్యమంత్రులు అయ్యేందుకు పోటీ పడుతున్నారని, వీరికి కుర్చీపై మాత్రమే ఆశ ఉందని, ప్రజల గురించి పట్టించుకోరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని ప్రచారం చేస్తున్నాయని, మొన్న గెలిచిన కర్ణాటక లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారని, ఇక్కడ మాత్రం అమలు చేస్తామని అంటున్నారని, వారి మాటలు నమ్మితే తెలంగాణ ప్రజలకు గోస తప్పదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ లను అక్కున చేర్చుకున్నది ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఈ జిల్లా ప్రజలు వలసలు వెళ్లి జీవించేవారని, ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వలసలు వస్తున్నారని, దీన్ని భట్టి చూస్తే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రు.లక్ష కోట్లు అయితే ,లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం ఎంత అవివేకమో అనే విషయం తెలుస్తుందన్నారు.బీసీ ల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీ వీడితే చనిపోయే సమయంలో పార్టీ మారడం సిగ్గుచేటని అనడం చూస్తే ఆయనకు బీసీలపై ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా తెలుస్తున్నదన్నారు.వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో బీఆర్ ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.