నార్సింగిలో మిస్ ఫైర్‌ … మహిళకు బుల్లెట్ గాయం

రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో ఆర్మీ ఫైరింగ్ మిస్ ఫైర్ కావడంతో మహిళకు బుల్లెట్ గాయమైన ఘటన కలకలం రేపింది.

నార్సింగిలో మిస్ ఫైర్‌ … మహిళకు బుల్లెట్ గాయం

విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో ఆర్మీ ఫైరింగ్ మిస్ ఫైర్ కావడంతో మహిళకు బుల్లెట్ గాయమైన ఘటన కలకలం రేపింది. సమీపంలోని ఆర్మీ ఫైరంగ్‌ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మిస్ ఫైర్ కావడంతో గంధంగూడలోని ఓ ఇంట్లో మహిళకు బుల్లెట్ తగింది. ఇంట్లో బట్టలు ఆరేస్తున్న మహిళ కాలుకు బుల్లెట్ తగలడంతో ఆమె కాలు దెబ్బతింది. నార్సింగ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.