ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌ళ్లు తిరిగి పడిపోయిన ఎమ్మెల్సీ క‌విత‌

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌గా, క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు

ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌ళ్లు తిరిగి పడిపోయిన ఎమ్మెల్సీ క‌విత‌

విధాత‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌గా, క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. అప్ర‌మ‌త్త‌మైన బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను ఆ వాహ‌నం నుంచి కింద‌కు దించారు. కాసేప‌టి త‌ర్వాత ఆమె తిరిగి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌సంగించారు.


జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రాయిక‌ల్ మండ‌లం ఇటిక్యాల‌లో నిర్వ‌హించిన రోడ్డు షోలో క‌విత పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో క‌విత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఒక‌ట్రెండు సార్లు క‌విత క‌ళ్లు మూసుకుపోయాయి. నీర‌సంగా ఉన్నారు. ఛాతీలో నొప్పి వ‌చ్చిన‌ట్లు ఆమె అనుమానించారు.


అనంత‌రం త‌న సెక్యూరిటీని అప్ర‌మ‌త్తం చేశారు క‌విత‌. వ‌సంత మాట్లాడుతుండ‌గానే కింద‌కు దిగి కూర్చున్నారు. కాసేప‌టి త‌ర్వాత క‌విత రోడ్ షోలో పాల్గొని ప్ర‌సంగించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌కు మ‌ద్ద‌తుగా ఆమె రోడ్డు షోలో పాల్గొన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.