Motkupalli Narasimhu | నాకు ఏ పదవి వద్ధు,వర్గీకరణపై ఆర్డీనెన్స్‌ చాలు.. సీఎం రేవంత్‌రెడ్డికి మోత్కుపల్లి వినతి

కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ నుంచి నాకు ఏ పదవి వద్దని, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మేరకు ఎస్సీ వర్గీకరణకు వెంటనే ఆర్డీనెన్స్‌ జారీ చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కోరారు.

Motkupalli Narasimhu | నాకు ఏ పదవి వద్ధు,వర్గీకరణపై ఆర్డీనెన్స్‌ చాలు.. సీఎం రేవంత్‌రెడ్డికి మోత్కుపల్లి వినతి

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ నుంచి నాకు ఏ పదవి వద్దని, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మేరకు ఎస్సీ వర్గీకరణకు వెంటనే ఆర్డీనెన్స్‌ జారీ చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుతో ఆగస్టు 1వ తేదీన మాదిగలకు.. మాదిగ ఉపకులాలకు స్వాత్యంత్రం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. నాకు ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సీటు రాలేదని మొన్నటి వరకు విపరీతంగా అసంతృప్తి ఉండేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత స్వయంగా సీఎం అసెంబ్లీలో ప్రకటించిన తరువాత ఆనందపడ్డానని అన్నారు. వర్గీకరణ అమలు చేస్తామన్న వంత్ రెడ్డికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాన్నారు. రేవంత్‌ ప్రకటన జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చిందని, జాతి అంత సీఎం వెంట ఉందన్నారు. సీఎం వచ్చి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం చాలా సంతోషం అన్నారు. రేవంత్‌ రెడ్డికి మేము అన్ని విధాలుగా రుణపడి ఉంటామన్నారు. రిజర్వేషన్స్ అమలు చేస్తే రేవంత్ కు చరిత్ర ఉంటుందన్నారు. 80 లక్షల మంది మాదిగలం నీ వెనుకే ఉన్నాం.. శాశ్వతంగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండొచ్చన్నారు. ఎవరో ఏదో అన్నారని… వెనక్కి తగ్గకండి రేవంత్ రెడ్డి అని తెలిపారు. భారత దేశానికి ఆదర్శవంతమైన సీఎంగా రేవంత్ ఉండబోతున్నారని తెలిపారు. మాదిగల జనాభా ప్రతిపాదికన ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకి ఇవ్వండి.. ఎవరిని నష్టపోకుండా చూడండని తెలిపారు. నాకు ఏ పదవి వద్దు.. నేను సీఎం వెంట కార్యకర్తగా పని చేస్తానన్నారు. జరగబోయే గ్రూప్స్.. టీచర్ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్స్ అమలు చేయండన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా దళిత నాయకుడని, దళితులందరికీ భట్టి మద్దతు ఇవ్వాలన్నారు. రిజర్వేషన్స్ అమలు చేయడానికి రేవంత్ కు భట్టి అండగా నిలవాలన్నారు. మాదిగ జాతి అంత కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడటానికి సిద్ధంగా ఉందన్నారు. రిజర్వేషన్స్ అమలు చేయడానికి మాల సోదరులు సహకరించాలని కోరారు. మంద కృష్ణ మాదిగను కూడా రేవంత్ కు సపోర్ట్ గా తీసుకువస్తామన్నారు. రిజర్వేషన్స్ పై ఆర్డినెన్స్ ను వెంటనే రేవంత్ సర్కార్ తీసుకురావాలన్నారు. ఎనభై లక్షల మంది మాదిగలను హైదరాబాద్ కు తీసుకువచ్చి సభ పెడుతామన్నారు. మాదిగ జాతికి రేవంత్ పెద్ద మాదిగ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.