కేసీఆర్ సమక్షంలో బీఆరెస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్‌రెడ్డిలు

విధాత : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డిలు బీఆరెస్‌లో చేరారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో వారు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు.
సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు భారీ సంఖ్యలో తరలివచ్చిన వారు అనుచరులు, మద్దతుదారులు కూడా బీఆరెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాగం జనార్ధన్‌రెడ్డి నాగర్ కర్నూల్ టికెట్‌ను, విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లిహీల్స్ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆరెస్‌లో చేరారు.