కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్‌రెడ్డి రాజీనామా

విధాత: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు. కాగా నాగర్ కర్నూల్ టికెట్‌కు తనకు దక్కక పోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి,సీనియర్ నేత జానారెడ్డి నేతల దృష్టికి తీసుకు వెళ్లినా టికెట్‌పై ఎలాంటి హామీ లభించలేదు.

కాగా..అకస్మికంగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలోనే టికెట్ కేటాయించింది. దీంతో నాగం పార్టీ తీరుపై తన అనుచరుల వద్ద, మీడియా సమావేశాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖలో తెలియజేశారు.