Nagarjuna Sagar | నాగార్జున సాగర్ డ్యాం గేట్ల మూసివేత..
నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

విధాత, హైదరాబాద్ : నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం వరకు క్రస్ట్ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు, కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల నీటిని వదిలారు.
కాగా, నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలులు ఉన్నాయి. తుంగభద్ర గేటు కొట్టుపోవడంతో పాటు ఎగువన వర్షాల నేపథ్యంలో మళ్లీ జూరాల, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరద ఉదృతి చేరిన పక్షంలో త్వరలోనే మరోసారి క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుద చేసే అవకాశముంది.