నిర్మల్ బీఆర్‌ఎస్‌లో చేరికలు

నిర్మల్ బీఆర్‌ఎస్‌లో చేరికలు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మ‌ల్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్య‌క్షుడు ఎలాల ముత్యంరెడ్డి, బీజేపీ మండ‌ల కార్య‌వ‌ర్గ స‌భ్యులు కొప్పెల ముత్యంరెడ్డి ఆపార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని శాస్త్రిన‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గురువారం వారికి గులాబీ కండువాలు క‌ప్పి బీఆరెస్ లోకి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు స్థానం లేదని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలతో తిరుగులేని పాలన కొనసాగిస్తున్న బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు.