ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

వృద్ద దంపతుల పెళ్లి సంబురం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు వృద్ధులు ఎనిమిది పదులు వయస్సులో పెళ్లి చేసుకున్నారు

ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

విధాత : వృద్ద దంపతుల పెళ్లి సంబురం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు వృద్ధులు ఎనిమిది పదులు వయస్సులో పెళ్లి చేసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాకు చెందిన 80ఏళ్ల సమిడా నాయక్‌, 75 ఏళ్ల వయస్సున్న గుగులోతు లాలమ్మను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 70 ఏళ్ల క్రితం వారిద్దరికి తండా ఆచారంలో గంధర్వ వివాహం జరిగింది. వారికి నలుగురు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు. మనుమడు యాకూబ్‌ పుట్టినరోజు సందర్భంగా వారి తాత, నానమ్మలకు కుటుంబ సభ్యులు, మనుమనులు, మనుమరాలులు మళ్లీ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించారు. ఆ వృద్ధ దంపతుల పెళ్లి చూడటానికి తండాలోని జనం అంతా తరలిరాగా ముసలి దంపతులు వధూవరులుగా మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టం సంబరంగా జరుపుకున్నారు. వారి పెళ్లీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.