ఓటుతోనే బుద్ధి చెప్పాలి..ఎమ్మెల్యే కంచర్లకు గుణపాఠం తప్పదు
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అనేక రకాలుగా హేళన చేస్తున్నారని, వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ పిలుపునిచ్చారు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అనేక రకాలుగా హేళన చేస్తున్నారని, వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ పిలుపునిచ్చారు.
70 ఏళ్లుగా నల్లగొండ నియోజకవర్గాన్ని ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో పెట్టుకుందని, నూతన సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.
బుధవారం తిప్పర్తి, మాడుగుల పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివిధ బూత్ లకు సంబంధించిన 2000 మంది ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడారు. బెదిరింపులకు భయపడేది లేదని, ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకునే వారికి దిమ్మదిరగాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు.
తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లోని ఏ ఒక్క గ్రామానికి కూడా బీటీ రోడ్డు వేయలేదన్నారు. త్వరలోనే గుర్తును వెల్లడిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాల బీఆర్ఎస్ అసమ్మతి నేతలైన సర్పంచులు, ఉపసర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.