తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతకు పోలీస్ శాఖ నిర్ణయం
తెలంగాణ ఉద్యమ కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఉద్యమ కేసుల వివరాలను సమర్పించాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ రవిగుప్తా ఆదేశాలిచ్చారు

విధాత : తెలంగాణ ఉద్యమ కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఉద్యమ కేసుల వివరాలను సమర్పించాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ రవిగుప్తా ఆదేశాలిచ్చారు. 2009నుంచి 2014 జూన్ 2వరకు ఉన్న కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే తెలంగాణ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ ఎన్నికల హామీల దిశగా వేగంగా అడుగులేస్తుండటంతో ప్రజల్లో ఆయన ప్రభుత్వంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణాస్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీలపైన సంతకం, దివ్యాంగురాలు రజినికి ఉద్యోగంతో పాటు 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ వసతి, 10లక్షల ఆరోగ్య శ్రీ బీమా పథకాన్ని అమలు చేయనుండం విశేషం. కాంగ్రెస్ తన ఎన్నికల హామీలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల ఇంటి స్థలం, గౌరవ భృతితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25వేల ఫించన్, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిని కూడా రేవంత్‌రెడ్డి అమలు చేస్తారన్న నమ్మకాన్ని ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్నారు.