Nagarjuna Sagar | నాగార్జునసాగర్ కు సందర్శకుల తాకిడి.. ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు

నాగార్జునసాగర్ ప్రాజెకు్ సందర్శనకు ఆదివారం సెలవు దినం పెద్ద సంఖ్యలో పర్యాటకులు పోటేఎత్తారు. ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల సాగుతుంది

Nagarjuna Sagar | నాగార్జునసాగర్ కు సందర్శకుల తాకిడి.. ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు

విధాత, హైదరాబాద్ : నాగార్జునసాగర్ ప్రాజెకు్ సందర్శనకు ఆదివారం సెలవు దినం పెద్ద సంఖ్యలో పర్యాటకులు పోటేఎత్తారు. ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల సాగుతుంది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలసోయగాలు చూసేందుకు సందర్శకులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ప్రధాన డ్యామ్‌, పవర్‌ హౌస్ సందర్శనతో పాటు ఎత్తిపోతల, బుద్ధవనం సందర్శిస్తున్నారు. సందర్శకుల తాకిడితో సాగర్ రోడ్డు మార్గాల్లో వాహనాల బారులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సాగర్ డ్యాం నుంచి ప్రస్తుతం అధికారులు ఉదయం 10గేట్లు, మధ్యాహ్నం 8గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

అయితే ముందుజాగ్రత నేపథ్యంలో అధికారులు బోటింగ్ రద్దు చేయడం కొంత సందర్శకులను నిరాశ పరిచింది. తుంగభద్ర గేట్లు ఎత్తిన నేపథ్యంలో సాగర్‌కు కృష్ణా వరద నీరు భారీగా చేరనున్న నేపథ్యంలో తిరిగి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముంది. అయితే పెద్ద సంఖ్యలో వస్తున్న సందర్శకులను డ్యామ్ పరిసరాల్లోకి రాకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలతో అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేమొత్తంలో నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.30 అడుగుల వద్ద ఉన్నది. ఇక ప్రాజెక్టులో 312.50 టీఎంసీలకుగాను 305.6 టీఎంసీల నిల్వ కొనసాగుతుంది