చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం : సీఎం కేసీఆర్
ఎల్.రమణకు మంచి రాజకీయ భవిష్యత్ విధాత,హైదరాబాద్ : తెలంగాణలో చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని.. ఇందుకు సంబంధించి త్వరలోనే శుభవార్త అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారానికి రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రమణకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. టీఆర్ఎస్‌లో […]

ఎల్.రమణకు మంచి రాజకీయ భవిష్యత్
విధాత,హైదరాబాద్ : తెలంగాణలో చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని.. ఇందుకు సంబంధించి త్వరలోనే శుభవార్త అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారానికి రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రమణకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. టీఆర్ఎస్‌లో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణ చేరికతో తీరిందన్నారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఒకట్రెండు నెలల్లో చేనేతలకు బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. వరంగల్‌లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్త 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు అని సీఎం గుర్తు చేశారు.
తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్
తెలంగాణ ఏర్పాటు అయితే ధనిక రాష్ట్రంగా మారుతామని రాష్ట్రం ఏర్పడక ముందే చెప్పానని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇండియాలోనే నంబర్ వన్ జీతాలు ఇస్తామని చెప్పాం. అది జరుగుతుంది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే మంచి జీతాలు అందుకుంటున్నారు. నిన్న 40 ఎకరాలు అమ్మితే రూ. 2 వేల కోట్లు వచ్చాయి. ఇలా వచ్చిన ప్రజా ధనాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తామని తేల్చిచెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూ వివాదాలు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు. తాను ఏ తెలంగాణను కోరుకున్నానో.. అది ఆవిష్కరించి తీరుతానని, రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.